Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నార్సింగి కౌన్సిలర్ ఉషారాణి
నవతెలంగాణ-గండిపేట్
కేసీఆర్ సర్కారు దళిత బంధును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కౌన్సిలర్ కె ఉషారాణి అన్నారు. బుధవారం ఆమె నార్సింగిలో విలేకరులతో మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధికి దళితబంధును అమలు చేయడం సంతోషమన్నారు. కానీ కేసీఆర్ సర్కారు ఓట్ల కోసం కేవలం కరీంనగర్ జిల్లా హూజురాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అన్నారు. దళితుల ఓట్ల కోసం మరోసారి మోసం చేసేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని మండిపడ్డారు. దళితులపై చిత్తశుద్ది ఉంటే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని కోరారు. కోకాపేట్ భూములమ్మగా వచ్చిన ఖజానను దళిత బంధు పేరుతో హుజురాబాద్ ఓట్ల కోసం ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
నిజమైన దళితులు రంగారెడ్డి జిల్లాలతో పాటు గండిపేట్ మండలంలో ఎక్కువ శాతం ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికీ దళిత బంధును అమలు చేసే వరకు కాంగ్రెస్ తరుపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.