Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
- ఇముల్నర్వలో రైతు వేదిక ప్రారంభం
నవతెలంగాణ-కొత్తూరు
గత పాలకులు 60 ఏండ్లు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మండలంలోని ఇముల్ నర్వ గ్రామంలో నిర్మించిన రైతు వేదికను సర్పంచ్ అజరు మిట్టు నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ స్వయంగా రైతు కావడం వల్ల రైతుల కష్టాలు తెలిసి వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో యేటా వ్యవసాయ రంగానికి రూ.60 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. రైతులకు వ్యవసాయం పట్ల మరింత నైపుణ్యం కలిపించేందుకు రూ.22 లక్షల వ్యయంతో రైతు వేదికలు నిర్మించినట్లు తెలిపారు. రైతు వేదికల్లో రైతులకు వ్యవసాయ అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ తీగల అనితారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి, కుచ్కుల్లా దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గణేష్, కొత్తూరు మండల పరిషత్ అధ్యక్షుడు పిన్నింటి మధుసూదన్‌రెడ్డి, కొత్తూరు జడ్పీటీసీ ఎమ్మె శ్రీలత సత్యనారాయణ, ఎమ్మార్వో రాములు, ఎంపీడీవో జ్యోతి, వ్యవసాయ అధికారులు ఏడీ రాజారత్నం, కొత్తూరు వ్యవసాయ అధికారి గోపాల్, విస్తరణ అధికారులు దీపిక, సనా, వైస్ ఎంపీపీ శోభా లింగం నాయక్, కొత్తూరు మండల రైతు కోఆర్డినేటర్ మెండే కష్ణ యాదవ్, మిట్టు నాయక్, లింగం నాయక్, రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని సర్పంచులు, రైతు కో-ఆర్డినేటర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.