Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎన్ రాజు
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
టీఆర్ఎస్ సర్కార్ భయం గుప్పిట్లో ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో, హామీల అమలులో పూర్తిగా విఫలమైందని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఎం రాజు అన్నారు. బుధవారం షాద్నగర్ పట్టణంలో మంత్రుల పర్యటనలో భాగంగా సీపీఐ(ఎం), సీఐటీయూ, ఎస్ఎఫ్ఐ, గిరిజన సంఘాల నాయకులను పార్టీ కార్యాలయంలో షాద్నగర్ పోలీసులు నిర్బంధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసి, సుపరిపాలన అందిస్తే అడ్డుకుంటారనే భయాలు ఉండవని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కండ్లు తెరవాలని, ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిర్బంధించిన వారిలో ప్రశాంత్, ఈశ్వర్, శ్రీను, తదితరులు ఉన్నారు.