Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ-ఫరూఖ్ నగర్
నియోజకవర్గాల్లో మంత్రులు పర్యటించాలంటే భయపడుతున్నారని, కాంగ్రెస్‌కు ప్రభుత్వం భయపడి పోలీసులను నాయకుల ఇండ్ల దగ్గర అరెస్ట్ చేస్తున్నారని షాద్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ అన్నారు. బుధవారం మంత్రులు షాద్‌నగర్ నియోజకవర్గంలో పర్యటించారు. వారిని అడ్డుకుంటారనే నెపంతో వీర్లపల్లి శంకర్‌తో పాటుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు నియోజకవర్గాల్లో పర్యటించేందుకు భయపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను సరిగ్గా అమలు చేస్తే భయపడాల్సిన అవసరం ఉండదన్నారు. నేడు ప్రభుత్వం హామీలను విస్మరించి చేయాల్సిన పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయడంతో ప్రతిపక్షాలు వెంటాడుతున్నాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గరపడుతున్నాయని తెలిపారు. పోలీసులతో ఉద్యమాలను అదుపు చేయలేరని, సరైన సమయంలో సరైన విధంగా కాంగ్రెస్ స్పందిస్తుందని తెలిపారు.