Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
నవతెలంగాణ-మొయినాబాద్
పేద ప్రజలందరికీ డబల్ బెడ్ రూం ఇండ్లను వెంటనే అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు.బుధవారం మొయినాబాద్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ మండల సమితి కార్య దర్శి కె.శ్రీనివాస్ ఆధ్వర్యంలో తొలుకట్ట గ్రామ స్తులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ అనితకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైయ్యారని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలు రాగానే ప్రజలను మభ్యపెడుతూ దళితబంధు ఇస్తానని ఆశలు పెంచుతున్నారని అన్నారు. తొలుకట్ట గ్రామ సర్వే నెంబర్లలో 138,139,143 డబుల్ బెడ్ రూమ్ నిర్మించి అర్హులైన పేదలకు అందజేయాలనీ, ప్రతి నిరుపేద దళితుడికి మూడెకాల భూమి ఇవ్వాల న్నారు.లేనియేడల ధర్నాలు,సమ్మెలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు రామస్వామి, తొలుకట్ట గ్రామ శాఖ కార్యదర్శి ఏం. వెంకటయ్య, మల్లేశ్, తొలుకట్ట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.