Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐనాపూర్ గ్రామంలో ఘటన
నవతెలంగాణ-దోమ
పాము కాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని అయినాపూర్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అయినాపూర్ గ్రామానికి చెందిన పాలేపల్లి అమృతమ్మ (23) మూడు రోజుల క్రితం ఇంటిదగ్గర బాత్ రూమ్‌కు వెళ్లగా పాము కాటు వేసింది. విషయం గమనించిన కుటుంబ సభ్యులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి ఆమెను హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందింది. మృతురాలి భర్త శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.