Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యురాలు హేమ
నవతెలంగాణ-దోమ
గర్భిణులకు 9 నెలలు చాలా కీలకమని వైద్యురాలు హేమ అన్నారు. బుధవారం మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్లో గర్భిణులకు మాత శిశు సంరక్షణ కార్డులను జారీ చేశారు. అనంతరం గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా డాక్టర్ సలహాలు పాటించాలని కోరారు. గర్భిణులకు కరోనా టెస్టులు నిర్వహించారు. తినే ఆహారం, పరిశుభ్రత వంటిపై ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రసవ సమయంలో గందరగోళం చెందాకుండా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం యాదమ్మ, ఆశావర్కర్లు మాధవి, గర్భిణులు పాల్గొన్నారు.