Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బండ్లగూడ మేనేజర్ మనోహార్
నవతెలంగాణ-గండిపేట్
కాలనీల్లో మొక్కలు నాటడంతో బృందావనంగా మారుతున్నాయని బండ్ల గూడ మేనేజర్ మనోహర్ అన్నారు. కాలనీ ప్రజల కోరిక మేరకు బుధవారం మేనేజర్ మనోహార్, కార్పొరేటర్ తలారి చంద్రశేఖర్ బండ్లగూడ కమిషనర్ ఆదేశాలతో మొదడి డివిజన్ బృందవన్కాలనీలోని ఖాళీ స్థలంలో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా జేసీపీతో చదును చేశారు. ముళ్ల పొదలను తొలగించి రెండు వందల వరకు మొక్కలు నాటేందుకు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మొక్కలు నాటేందుకు గుంతలను తవ్వించారు. నాటిన మొక్కలను పరిరక్షించుకునే బాధ్యత కాలనీ వాసులపై ఉందని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ సూపర్ వైజర్, కాలనీ వాసులు తలారి ప్రేమ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.