Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలి
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
- గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం
నవతెలంగాణ - రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
దేశంలో ఏ మెట్రో పాలిటన్ నగరంలో లేని విధంగా హైదరా బాద్ నగరం చుట్టూ నిర్మాణమవుతున్న లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లలో రంగారెడ్డి జిల్లాలోని నిరుపేదలకు కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇం ద్రారెడ్డి వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ పని తీరును సమీక్షించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇల్లు లేని పేద కుటుం బాలు ఎన్నడూ ఊహించని విధంగా అద్భుతమైన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 9 వేల కోట్ల ఖర్చు చేస్తోందన్నారు. ఇండ్ల నిర్మాణం సందర్భంగా స్థానికంగా అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందన్నారు. పేదలు కూడా గొప్పగా బతకాలనే సంక ల్పంతోనే ప్రభుత్వం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందన్నారు. రాజీవ్ గృహ కల్ప, ఇందిరా ఆవాస్ యోజన పథకాల్లో భాగంగా నిర్మించి ఇచ్చిన ఖాళీలను గుర్తించి వివరాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూంలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియను డిసెంబర్లో పూర్తి చేసి మార్చిలో ఇండ్లను లబ్దిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి పీడీ రాజేశ్వర్‌రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు అంకం రావు, శ్రీధర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.