Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భేరి రామచందర్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు కషి చేస్తామని నేతాజీనగర్‌లో అఖిల భారత యాదవ మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు భేరీ రామచందర్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను ప్రకటించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. స్వరాష్ట్రంలో వెనుకబడిన కులాలకు, బీసీలకు రాజకీయంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ అవకాశం కల్పిస్తున్నారని తెలిపారు. ఇందుక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఉద్యమకార్లకు అవకాశం కల్పించడం శుభ పరిణామం అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో వెనుకబడిన కులాల వారిని కలుపుకొని గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు అఖిల భారత యాదవ మహాసభ ద్వారా కషి చేస్తామని తెలిపారు.