Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభినందించిన అత్తెల్లి ప్రజలు
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ మున్సిపల్ సమీపంలో అతెల్లి గ్రామానికి చెందిన రాజేష్ కొంపల్లి గ్రామంలోని పాలిటెక్నిక్ కాలేజ్ సమీపంలో ఉన్న ఓ బావిలో మద్యం మత్తులో ఈత కొడుతూ ఊపిరాడక బావిలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న వికారాబాద్ పట్టణ ఎస్ఐ లక్ష్మయ్య సంఘటనా స్థలానికి వెళ్లి మతదేహాన్ని గుర్తించి బయటికి తీసేందుకు గ్రామస్తుల సహాయం కోరాడు. కానీ భయంతో గ్రామస్తులు ముందుకు రాలేదు. దీంతో ఒక వ్యక్తి సహాయంతో తానే స్వయంగా బావిలోకి దిగి మతదేహాన్ని వెలికితీశారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువులు, మిత్రులు పెద్దసంఖ్యలో బావి దగ్గరికి చేరుకొని ఎస్సై లక్ష్మయ్య కతజ్ఞతలు తెలిపారు.