Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యులు అంజన పన్వార్
- జిల్లా అధికారులకు ఆదేశాలు
నవతెలంగాణ -రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సక్రమంగా అమలు చేసి వారి జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ సభ్యులు అంజన పన్వార్ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని హరిత ప్లాజా గెస్ట్ హౌస్‌లో అంజన పన్వార్ పారిశుధ్య కార్మికుల కోసం జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న పథకాల పురోగతిపై జిల్లా కలెక్టర్ డి అమోరు కుమార్, జిల్లా అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌తో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని సాహెబ్‌నగర్ పద్మావతి కాలనీలో వరదనీటి డ్రయినేజీ పూడికతీత పనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు జీహెచ్ఎంసీ కాంట్రాక్టు కార్మికుడు శివయ్య, అంతయ్య మృతిచెందడం దురదష్టకరమన్నారు. ఇటాంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. దీనిపై కలెక్టర్ అమోరు కుమార్ స్పందిస్తూ ఇప్పటికే ఆ కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మంజూరుతో పాటు తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 4 లక్షల 12వేల 500వందల రూపాయలు అందించినట్టు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లాలో పారిశుధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందుకు మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వేతన స్లిప్, పీఎఫ్, ఈఎస్ఐచ, బీమా అందిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్లు తెలిపారు. పారిశుధ్య కార్మికులు నివసించే ప్రాంతంలో ఏడాదికి రెండుసార్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీస్స్టేషన్లలో పారిశుధ్య కార్మికులను నియమించి కనీస వేతనాలను అందించాలని ఆదేశించారు. వారి పిల్లలను సాంఘిక సంక్షేమ వసతి గహాల్లో చదువుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ ప్రణాళిక కింద ఇచ్చే ప్రభుత్వ సబ్సీడీ రుణాలు బ్యాంకుల ద్వారా అందించి, వారి ఆర్థిక ఎదుగుదలకు దోహదపడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, సైబరాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, రాచకొండ డీసీపీ సంప్రీత్ సింగ్, ఏసీపీలు, సోషల్ వెల్ఫేర్ జేడీ శ్రీధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, జీహెచ్ఎంసీ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, పారిశుధ్య కార్మికుల సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు.