Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గడువు ఇవ్వాలని ప్రాధేయపడిన కనికరించని మహేంద్ర ఫైనాన్స్ సిబ్బంది
- విష్ణువర్ధన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: గ్రామస్తులు
నవతెలంగాణ-మొయినాబాద్
మహేంద్ర ఫైనాన్స్ వేదింపులు తట్టుకోలేక యువ కుడు ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మొయి నాబాద్ మండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం మహేంద్ర ఫైనాన్స్‌లో విష్ణు వర్ధన్ (21) జీవనోపాధిని పొందేందుకు ఆటోను కొనుగోలు చేశారు.అయితే కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి లేకపోవడంతో నెలసరి కట్టాల్సిన ఏడు నెలల ఫైనాల్స్ కట్టడం ఆ కుటుంబానికి భారంగా మారింది. బుధవారం మహీంద్రా ఫైనాన్స్ నిర్వాహకులు విష్ణువర్ధన్ ఇంటికి వచ్చి, ఫైనాన్స్ కట్టాలని వేధించగా, తమ ఇంటివద్ద ఎవ్వరు లేరు ఆటోను తీసుకెళ్ళొద్దని, కొన్ని రోజులు సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా కనికరించక లేదు. దీంతో ఆయన మనస్తాపానికి గురై, ఉరివేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. బాధిత కుటుంబాన్ని మహీంద్రా ఫైనాన్స్ నిర్వహుకులు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.