Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గండిపేట్
హుజురాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధును అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఆరెమైసమ్మ టెంపుల్ వద్ద దీక్షలు చేపట్టగా రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ దళితుల అభివృద్ధిని కోరుకునే కేసీఆర్ సర్కారు వెంటనే దళితబంధులను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్చార్జి జ్ఞానేశ్వర్, జిల్లా నాయకులు ముంగి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ బండ్లగూడ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తలారి ప్రేంకుమార్, మైలారం శ్రీనివాస్, పాపిరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకులు గణేష్, జగన్ పాల్గొన్నారు.