Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు సురేష్ మాదిగ
నవతెలంగాణ-కేశంపేట
హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ కేశంపేట మండల అధ్యక్షుడు గ్యార సురేష్ మాదిగ అన్నారు. కేశంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద షెడ్యూల్డ్ కులాల సమగ్ర అభివద్ధి సాధన కమిటీ చైర్మన్ మంద కష్ణ మాదిగ, అద్దంకి దయాకర్ మాల పిలుపు మేరకు గురువారం నిరాహార దీక్ష ప్రారంభించారు. రైతు బంధు పథకం లాగే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఒక్కొక్క కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మంగళగూడెం కిష్టయ్య, బచ్చల కూర లక్ష్మయ్య, అల్వాల యాదయ్య, నరేందర్ లక్ష్మయ్య, రమేష్, బుచ్చయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.