Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
గొర్లు, మేకల పెంపకందార్లు తమ జీవాలకు నట్టల నివారణ మందును తప్పక తాగించాలని జిల్లా పరిషత్ గ్రామీణాభివద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. కడ్తాల్ మండలంలోని రేఖ్యా తండాలో గురువారం సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు, రేఖ్యాతండా సర్పంచ్ హరిచంద్ నాయక్తో కలిసి జీవాలకు నట్టల నివారణ మందులు తాపించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు బండి మంజుల చంద్రమౌళి, ప్రియా రమేష్ నాయక్, స్థానిక నాయకులు, పశువైద్య అధికారుల బందం పాల్గొన్నారు.
చిన్న ఎల్కిచర్లలో..
కొందుర్గు : మండల పరిధిలోని చిన్నఎల్కిచర్లలో గొర్రెలకు, మేకలకు ఉచిత నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని గ్రామసర్పంచ్ సంధ్యారాణి శేఖర్ గురువారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ యేటా మూడు సార్లు గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు వేయాలని తెలిపారు. మందులతో గొర్రెలు, మేకలు ఆరోగ్యంగా ఎదుగుతాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాన్ని గొర్రెల, మేకల కాపరులు ఈ అవకాశాన్ని సద్వి నియోగం చేసు కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కో-ఆప్షన్ మెంబర్ కలీం, రాఘవేందర్ యాదవ్, రమేష్ గౌడ్, శ్రీశైలం, మహేష్ యాదవ్, ముక్రమ్ అలీ, వెటర్నరీ డాక్టర్ శివకష్ణ పాల్గొన్నారు.