Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్
నవతెలంగాణ-ఆమనగల్
క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించవచ్చని జిల్లా పరిషత్ గ్రామీణాభివృద్ధి శాఖ స్టాండింగ్ కమిటీ సభ్యులు, కడ్తాల్ జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ అన్నారు. జెడ్పీటీసీ జర్పుల దశరథ్ నాయక్ కుమారుడు రాధాకృష్ణ్ణ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం కడ్తాల్ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ, ఎంపీఓ తేజ్ సింగ్ల సారధ్యం లో కార్య దర్శులకు రెండు టీంలుగా విభజించి ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వ హించారు. జెడ్పీటీసీ జర్పుల దశరథ్నాయక్ పోటీలను ప్రా రంభించి మాట్లాడారు. ఆటల పోటీలతో మానసిక ఉల్లాసం తో పాటు యువకుల్లో స్నేహాభావం పెంపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా విజేతగా నిలిచిన ఎంపీఓ టీంతో పాటు రెండవ స్థానంలో నిలిచిన ఎంపీడీఓ టీంకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు గూడూరు లక్ష్మీ నరసింహరెడ్డి, రామావత్ తులసిరామ్ నాయక్, యాదయ్య, ఎంపీటీసీ లచ్చిరామ్ నాయక్, పూజ దేవా నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యులు కంబాలపల్లి పరమేష్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు గంప శ్రీను, గణేష్, రాజు, సంతోష్, భీమ్లా నాయక్, సురేష్, బీక్యా నాయక్, తులసీరామ్ నాయక్, జగన్ నాయక్, రాజేష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.