Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంషాబాద్
థర్డ్ వేవ్ ముప్పును ఎదుర్కోవాలంటే ప్రభుత్వ నిబంధ నల ప్రకారం ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా వేసుకోవాలని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి కౌన్సిలర్ పెదిరిపాటి రాణియాదయ్య అన్నారు. శుక్రవారం తొండు పల్లి వార్డు కౌన్సిలర్ కార్యాలయంలో కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తు న్న కరోనా నేటికీ విజృంభిస్తుందన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో థర్డ్ వేవ్ ప్రారంభమైందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. కర్నాటక రాష్ట్రంలో చిన్నపిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అక్కడ సుమారు 300 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని అన్నారు. మహమ్మారిని సమ ర్థంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ టీకా వేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటి స్తూనే వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించా లని అన్నారు. మొఖానికి మాస్కు ధరించి అవసరమైన మే రకు సానిటైజ్ చేసుకోవాలని సూచించారు. కరోనా నిబంధ నలు పాటిస్తూ తొండుపల్లీ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రజలు టీకా తీసుకోవాలన్నారు. తోండుపల్లి ఆరోగ్య కేంద్రం వద్ద టీకా చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్ట తెలిపా రు. టీకా వేసుకోవడానికి మన భయం ఉంటే డాక్టరును సంప్రదించి తగిన సలహాలు సూచనలు తీసుకోవాలని అ న్నారు. ప్రజలు నిబంధనలు పాటిస్తూ టీకా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ రాణి యాదయ్యగౌడ్, పెదిరిపాటి ప్రవీణ్, సుధాకర్, శేఖర్, సునీల్, మహేష్ యాదవ్, కరుణాకర్, పాండు, సునీల్, ని రంజన్, స్వామి, యాదయ్య, అశోక్ నాయకులు పెదరిపాటి ప్రవీణ్ గౌడ్, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.