Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- హైదరాబాద్‌లో పదవ ఎడిషన్ ప్రాపర్టీ షో ప్రారంభించిన క్రెడారు
నవతెలంగాణ-మియాపూర్ (మాదాపూర్)
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. క్రెడారు ఆధ్వర్యంలో మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ పదవ ఎడిషన్ ప్రాపర్టీ షోను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఎంతో భవిష్యత్తు ఉందని రియల్ఎస్టేట్ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. క్రై ఇలాంటి ప్రాపర్టీ షోలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలు ఏ సంస్థలో తాము ఎలాంటి ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి చక్కని అవకాశం దొరుకుతుందని తెలిపారు. ఇక్కడే లాంటి సంస్థలో మెంబర్లో ఉన్న నిర్మాణ సంస్థలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సమస్త వినియోగదారులకు మంచి ప్రాపర్టీని అందిస్తుందని గుర్తు చేశారు. గృహ నిర్మాణ సంస్థలు హైదరాబాద్ నగరం ఒక వైపు మాత్రమే నిర్మాణాలు చేపడుతుందని హైదరాబాద్ నలుమూలల నిర్మాణాలు చేపట్టేందుకు కషి చేయాలని నిర్మాణ సంస్థలకు గుర్తుచేశారు. దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్లాట్ల నిర్మాణం కోసం ప్రాజెక్టులు చేపట్టాలని అలాంటి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. క్రెడారు హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారావు మాట్లాడుతూ కువైట్ నిబంధనలను అనుసరిస్తూ 150 ఏండ్ల నుంచి వందకు తగ్గించామని తెలిపారు. ఈ ప్రాపర్టీ షో 13, 14, 15 ఆగస్టు తేదీలలో హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నిర్వహిస్తున్నామని సొంతింటి కల నిజం చేసుకునే వ్యక్తులు ప్రాపర్టీ షోకి వచ్చి వినియోగదారులకు ఈ విధమైన సందేహం ఉన్నా తెలుసుకోవ చ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన రల్ సెక్రెటరీ వి. రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్య క్షులు ఆనంద్‌రెడ్డి, రాజేశ్వర్ జగన్నాథరా వు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.