Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న అభివృద్ధి శూన్యం
- నిధులు ఇవ్వాలని అడిగిన ఇవ్వడం లేదు సర్పంచ్ వడ్డే సుజాత చంద్రయ్య ,
- శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం అసంపూర్తిగా అంగన్వాడీ కేంద్రం
- శిలాఫలకానికె పరిమితమైన పాలమాకుల ముచ్చింతల్ రోడ్డు
నవతెలంగాణ - శంషాబాద్
ముచ్చింతల్ గ్రామం నేడు అందరికీ సుపరిచి తమైన గ్రామం. శంషాబాద్ అంతర్జాతీయ విమానా శ్రయం తర్వాత ఎంత ఖ్యాతి కీర్తి గడుస్తున్న ఏకైక గ్రామం ముచ్చింతల్. ఇది ఒక వైపు కనిపిస్తున్న దృశ్యం అయితే మరోవైపు అభివృద్ధికి నోచుకోకుండా ప్రభుత్వానికి పాలకులకు అధికారులకు సంబంధం లేదు అన్నట్లుగా మూలకు విసిరి వేయబడిన గ్రామంగా కనిపిస్తున్నది. గ్రామంలో నిధులు లేక అభివృద్ధి చేయలేకపోతున్నామని సర్పంచ్ వడ్డే సుజాత చంద్రయ్య తోపాటు ఉప సర్పంచ్ గండు రాజు వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గ్రామంలో అత్యవసర గ్రామసభ నిర్వహిం చి గ్రామసభలు సమస్యలు ఏకరువు పెట్టారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భానురి మనెమ్మ, కడల రాజు, కారుకొండ ప్రదీప్, కందూరి చంద్రకళ కందూరి శంకరమ్మ, కత్తుల సత్యమ్మ, కత్తుల సుభాష్, జొన్నాడ కల్పన కత్తుల ప్రశాంత్ పాల్గొన్నారు. నిధులు కేటాయించకుండానే ప్రతిపక్ష పార్టీలో ఉన్నందున వివక్ష చూపిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకెళ్తే హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మండల పరిధిలోని ముచ్చింతల్ గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1772 మంది ఉన్నారు. నూటికి 90 శాతం మంది వ్యవసాయం వ్యవసాయ కూలీలుగా జీవనం ఉపాధి పొందుతున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయని సర్పంచ్‌గా పదవి బాధ్యతలు స్వీకరించి రెండున్నర సంవత్సరాలు అవు తున్నా ప్రజలకు న్యాయం చేయలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీరోడ్లు అంతర్గత మురుగు కాలువలు, అసంపూర్తి భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని స్థానిక రాజేంద్రన గర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్‌గౌడ్‌కు, శంషాబాద్ జడ్పీటీసీ తన్విరాజుకు, ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్‌కు సంబంధిత అధికారులకు స్వయంగా కలిసి వినతి ప త్రాలు ఇచ్చిన కేటాయించడం లేదని వాపోతున్నారు.
అసంపూర్తిగా అంగన్వాడీ కేంద్రం
గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి శంషాబాద్ జడ్పిటిసి కేటాయించిన 3లక్షలతో స్లాబ్ వరకు మాత్రమే పనులు చేశారు.
శిధిలమైన పాఠశాల భవనం
ప్రాథమిక ఉన్నత పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నది. 20 ఏండ్ల నుంచి కూడా ఒక్క పాఠశాల భవనం నిర్మించలేదు. ఉన్న పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అది వర్షాలకు ఎప్పుడూ ఆందోళన నెలకొన్నది. లోపల పై కప్పు కూలిపోయే దశకు చేరుకున్నది. శిథిలమైన పాఠశాల భవనాన్ని కూల్చాలని అనేకసార్లు అధికారులకు మండల సర్వసభ్య సమావేశ దృష్టికి తీసుకు వచ్చిన ఇలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
డ్రయినేజీ, సీసీరోడ్ల సమస్య
గ్రామంలో డ్రయనేజీ, సీసీరోడ్ల నిర్మాణానికి దానికి నిధులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. 14 ఫైనాన్స్ జీపీ నిధులతో కొంత వరకు పనులు చేపట్టిన ఇంకా 50 శాతం పనులు అలాగే మిగిలిపోయాయని అంటున్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు జరగాలంటే సుమారు 50 లక్షల నుంచి కోటీ రూపాయల వరకు ఉన్నాయి.
శిలాఫలకం వేసి రోడ్డు నిర్మాణం మారిచారు
ముచ్చింతల్ పాలమాకుల గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం అప్పటి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పాలమాకుల గ్రామం వద్ద 1.30 కోట్లతో రోడ్డు నిర్మించడానికి శిలాఫలకం వేసి వదిలేశారు. ముచింతల్ పాలమాకుల గ్రామాల మధ్య కేవలం మూడు కిలోమీటర్ల దూరం రోడ్డు వేయడానికి శిలాఫలకం వేసి పనులు చేపట్టకపోవడం వల్ల పాలమాకుల నుంచి పి వన్ రోడ్డుగుండా ముచ్చింతల్ వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు దూరం అవుతుంది. మదనపల్లి నుంచి ముచ్చింతల్ గ్రామానికిఅధ్వాన్నంగా తయారైంది.
నిధులు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారు : వడ్డే సుజాత చంద్రయ్య సర్పంచ్ ముచ్చింతల్
గ్రామంలో అభివృద్ధి పనులకు నిధులు కేటా యించాలని ఎంపీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే , జడ్పీటీసీ, ఎంపీపీ, అధికారులకు అనేకసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోవడంలేదు. అధికార పక్షంలో లేనందుకు మాపై వివక్ష చూపిస్తున్నారు. గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి పోతున్నాయి. పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు రోడ్లు, డ్రయినేజీ ఇతర సమస్యలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామానికి నిధులు కేటాయించాలని కోరుతున్నాం.