Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల పరిధిలోని లింగన్‌పల్లి గ్రామానికి చెందిన కొండని చెన్నయ్య అనే రైతు తన వరి పొలంలో చల్లేందుకు దోమ మండల కేంద్రంలోని రుద్ర ఫర్టిలేజర్ షాపులో ఏడు డీఏపీ సంచులు తెచ్చాడు. పొలానికి డీఏపీ చల్లుతున్న క్రమంలో రైతుకు అనుమానం వచ్చి డీఏపీ బస్తాను పరిశీలించగా ఇసుక కనబడింది. కల్తీ వ్యవహారాన్ని వెంటనే గ్రామ సర్పంచ్ ద్వారా వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకె ళ్ళాడు. డీఏపీ బస్తాలు పరిశీలించిన వ్యవసాయ అధికారులు అది ఇసుక కాదని, డీఏపీలో ఉండే రసాయన పదార్థాలని చెప్పినట్టు రైతులు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటకు చెప్పొద్దని, మీకు షాపు యజమాని ద్వారా పరిహారం ఇప్పిస్తామని చెప్పినట్టు రైతులు ఆరోపిస్తున్నారు. కొన్నేండ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నామని ఇసుకకు రసాయనాలకు తమకు తేడా తెలియదా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ లాగా మరికొంత మంది రైతులు మోసపొవ్వద్దంటే సంచులు కల్తీ ఎక్కడ జరిగిందో గుర్తించి కల్తీల నుంచి తమకు కావాలని కోరారు. మండల కేంద్రం లో ఉన్న రుద్ర ఫర్టిలైజర్ దుకాణంలో ఇన్చార్జి ఏవో లావణ్యతో కలిసి కిసాన్ డీఏపీి సంచులను పరిశీలించారు. డీపీఏ సన్నగా డస్ట్ మాదిరిగా ఉన్న దానిని ల్యాబ్‌కు పంపించి పరీక్ష చేస్తామన్నారు. ల్యాబ్ పరీక్ష తేలినంతవరకు ఫర్టిలైజర్‌లో డీఏపీ విక్రయించొద్దని ఫర్టిలైజర్ నిర్వాహకులు మురళికి సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.