Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
పరిగి మండల పరిధిలోని నస్కల్ గ్రామంలోని రైతు వేదిక పెళ్ళి వేదికగా మారింది. రైతులు-వ్యవసా య అధికారులతో సమన్వయం కో సం ఏర్పాటు చేసిన వేదిక బాజాబజంత్రీలతో మారు మో గింది. రైతులతో ఉండాల్సిన వేదిక పెళ్ళి చుట్టాలతో సందడి గా మారింది. రుచికరమైన వంటకాల గుమ గుమలతో సందడిగా మారింది. గ్రామానికి చెందిన ఓ టీఆర్ఎస్ నేత తన కుమారుడి పెళ్ళి ఘనంగా నిర్వహించాడు. ఈ పెళ్ళికి గ్రామానికి చెందిన మరో టీఆరెఎస్ నేతకు మూడువేలు తీసుకుని అనుమతి ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలపై పరిగి ఏడీఏ వీరప్పను వివరణ కోరగా రైతువేదికలపై పూర్తి అజామాయిషీ వ్యవసాయ శాఖకే ఉంటుందని గ్రామ పంచాయతీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పెండ్లిళ్లకు రైతు వేదికల్లో ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.