Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యూటీఎఫ్ డిమాండ్
నవతెలంగాణ-కోట్‌పల్లి
ఉద్యోగుల కుటుంబాలకు సామాజిక భద్రత లేకుండా చేసిన కంట్రిబ్యూటరీ ఫించన్ విధానం (సీపీిఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాల ని రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ప్రజాస్వామిక అభ్యుదయ విలువలతో కూడిన విద్యా విధానం సాధన కోసం టీఎస్‌యూటీఎఫ్ కృషి చేస్తుందని ఆ సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వెంకట్ రత్నం అన్నారు. శుక్రవారం కోట్‌పల్లి మండల పరిధిలోని బార్వాద్, మోత్కుపల్లి, నాగసన్ పల్లి, జిన్నారం, రాంపూర్, కోట్‌పల్లి, కొత్తపల్లి, పాఠశాలల్లో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు దశాబ్దాల కాలంలో విద్యా హక్కు చట్టం సాధన కోసం, జాతీయ పాఠ్యప్రణాళిక తయారీ కోసం జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించామన్నారు. విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలని, కొఠారి సిఫారసుల మేరకు విద్యకు జీడీపీలో 6శాతం, కేంద్ర బడ్జెట్లో 10శాతం నిధులు కేటాయించాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారించాలన్నారు. ఈ ఆకర్యక్రమంలో సంఘం మండలాధ్యక్షుడు ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కే నరేష్, జిల్లా నాయకులు న్.వెంకట్‌రెడ్డి, గోపాల్, నర్సింలు, రాములు, రాజశేఖర్, ఫరూక్, తదితరులు పాల్గొన్నారు.