Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మదనపల్లి సర్పంచ్ తుల్చానాయక్, ఉప సర్పంచ్ ఆంజనేయులు
అత్యవసర గ్రామ సభ నిర్వహణ
నవతెలంగాణ-శంషాబాద్
గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించ డానికి చర్యలు తీసుకుంటున్నామని మండల పరిధిలోని మదనపల్లి గ్రామ సర్పంచ్ కే. తుల్చానాయక్, ఉప సర్పంచ్ ఆంజనేయులుగౌడ్ అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అత్యవసర గ్రామ సభను సర్పంచ్ తెలుసా తుల్చా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమస్యలను గ్రామపంచాయతీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిష్కరించిన సమస్యలను గురించి పంచాయతీ కార్యదర్శి రమ్య సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో నిధుల కొరత తీవ్రంగా ఉందని ఈ విషయంపై ప్రజాప్రతినిధుల కు, అధికారులకు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. సీసీరోడ్లు అంతర్గత డ్రయినేజీ నిర్మాణం, వీధి దీపాలు, హరితహారం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు పల్లె ప్రకృతి వనం ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేపట్టినట్టు తెలి పారు. ఇంకా చాలా సమస్యలు మిగిలి ఉన్నాయని గ్రామం లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుం టామని అన్నారు. తాగునీరు కలుషితమవుతున్న విషయం దృష్టికి వచ్చిందని వెంటనే చర్యలు తీసుకుంటామని అన్నారు.
పింఛన్ల పంపిణీలో అవినీతి
గ్రామ వార్డు సభ్యురాలు శోభారాణి మాట్లాడుతూ ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్లు, వితంతు వికలాంగుల పింఛన్లల పంపిణీలో అవినీతి జరుగుతోందని అన్నారు. 2016 రూపాయలు, 3016 రూపాయలు పంపిణీదారులు లబ్దిదారులకు పంపిణీ చేయాల్సి ఉండగా అందులో 16 రూపాయల చొప్పున ప్రతి లబ్దిదారుల నుంచి పంపిణీదారులు తీసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వాలు దూరదృష్టితో ఆలోచించి అచేతన స్థితిలో ఉన్న ప్రజలకు ఆసరా పింఛన్లు అందిస్తుంటే పంపిణీ చేసే కోఆర్డినేటర్లు డబ్బులు కొట్టేస్తున్నారని కొట్టేస్తున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
అంగన్వాడీ కేంద్రానికి సొంత భవనం నిర్మించాలి
మదనపల్లి అనుబంధ గ్రామమైన గచ్చుబాయి తండాలో అంగన్వాడి కేంద్రానికి సొంత భవనం లేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అంగన్వాడీ టీచర్ రజిత అన్నారు. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలో 41 మంది చిన్నారులు 11 మంది బాలింతలు, గర్భిణులు ఉన్నారని తెలిపారు. బాత్రూంలు ఇతర సదుపాయాలు లేవని చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీనికి స్పందించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రం నిర్మాణానికి రెండేండ్ల క్రితం నిధులు మంజూరైనాయని అన్నారు. సర్వే నెంబర్ 63లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అందులో అంగన్వాడీ కేంద్రానికి స్థలం చూపించాలని రెవెన్యూ అధికారులకు విన్నవించినా ఇప్పటివరకు స్థలం చూపించలేదన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గిరిజనులు ఉండే ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి పక్కా భవనం నిర్మించుటకు స్థలం కేటాయించాలని కోరారు. మదనపల్లితో పాటు అనుబంధ గ్రామాల్లో నెలకొన్న ప్రతి సమస్యను దశల వారీగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమ్య, వార్డు సభ్యులు కే. శోభారాణి, పి. లత, సోను, కో-ఆప్షన్ సభ్యులు వెంకటేష్ , అంగన్వాడీ టీచర్ లు రజిత, మంగ కారోబార్ జగన్, తదితరులు పాల్గొన్నారు.