Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
నవతెలంగాణ-బషీరాబాద్
ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తాండూర్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బషీరాబాద్ మండలం కొర్విచేడ్ గనిలో డీఎంఎఫ్టి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూర్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, సబితాఇంద్రారెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు విఠల్ నాయక్, అరుణ గోపాల్ రెడ్డి, వైస్ ఛైర్మన్లు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, సర్పంచ్ సునీత, సెవ్య నాయక్ ఎంపీటీసీ శ్రీనివాస్, నాయకులు మల్కూడ్ వెంకటేష్, రాజరత్నం, నర్సిరెడ్డి, శ్రీనివాస్ చారి, రామునాయక్, రంగారెడ్డి, రజాక్, మునిందేర్ రెడ్డి, మోహన్ నాయక్, పాండురంగ రెడ్డి, బంట్వరం సుధాకర్, పవన్ టాకుర్, తదతరులు ఉన్నారు.