Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ పంది కృపేష్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గొల్లకుర్మలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఇబ్రహీంపట్నం ఎంపీపీ పంది కృపేష్ అన్నారు. మండల పరిధిలోని పోచారంలో పశువైద్య శిభిరం నిర్వహించారు. గొర్రెలు, మేకలకు నట్టల మందు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొల్లకుర్మలకు నిలయమైన పోచారంలో అధికశాతం జీవాలను నమ్ముకునే జీవనం సాగిస్తున్నారన్నారు. వివిధ రోగాలు సోకి జీవాలు మృత్యువాత పడుతున్నాయని గుర్తు చేశారు. దాంతో కాపరులు ఆర్థికంగా నష్టపోతున్నారని గుర్తు చేశారు. గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ పశువైద్యశాలు ఉందన్నారు. పోచారంలోనే పశువైద్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా గ్రామానికి అనుబంధంగా ఉన్న ఉప్పరిగూడ, కర్ణంగుడా, చర్లపటేల్గూడా, తుర్కగూడ, రాంరెడ్డిగూడ, మేటీల్ల, ఎర్రగుంట గ్రామాలకు రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్య అధికారి అంజిలప్ప, అడిషనల్ అధికారి క్రిష్ణయ్య, డాక్టర్ సురేష్, గ్రామ సర్పంచ్ అరుణ, ఉపసర్పంచ్ భగీరథ, గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు దాయి జంగయ్య, పోచారం గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు కృష్ణ, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఇబ్రహీం, బాల చారి, దాయికృష్ణ, చంటి, యాదవ్, పాల్గొన్నారు.