Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
- నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి సబితారెడ్డి
నవతెలంగాణ- షాద్‌నగర్ రూరల్
షాద్‌నగర్ గ్రేడ్ వన్ గ్రంథాలయ భవన నిర్మాణాన్ని కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో చేపడుతున్నట్టు షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తెలిపారు. గురువారం ఉదయం 10:30 గంటలకు భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని కూల్చి అదే స్థలంలో అన్ని హంగులతో భవన నిర్మాణం చేపడుతామన్నారు. అదేవిధంగా పట్టణంలోని కుంట్ల రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేయనున్నట్లు తెలిపారు.