Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మియాపూర్ (గచ్చిబౌలి)
శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని కేశవనగర్ ఉన్న వినాయక మండపం సమీపంలోని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన, మొబైల్ వాక్సినేషన్ సెంటర్ను బుధవారం గచ్చిబౌలి డివిజన్ కార్పొ రటర్ వి.గంగాధర్ రెడ్డి సంద ర్శించారు. అనంతరం కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లా డుతూ ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రే షన్ చేసుకోవడం రాని వాళ్లకు ఈ మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ ఎంతో ఉపయోగ పడుతుం దన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా స్థానికంగా ఉన్న కమిటీ హాల్లు, ఫంక్షన్ హాల్లు, స్కూళ్ళలోనే వాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కువ సేపు లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఉదయం 10 గంటల నుంచి ఒక్కో మొబైల్ సెంటర్ ద్వారా రోజుకి 350 నుంచి 400 మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు ఆధార్ వివ రాలు తెలిపి వాక్సిన్ వేసుకోవ చ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి ,సీనియర్ నాయకులు హరీష్ శంకర్ యాదవ్, కిషన్ గౌలి, అనిల్, వెంకటేష్, ప్రభాకర్ ,శివ, ప్రసాద్,, జై శ్రీనివాస్, రాజు, యాదయ్య, రమేష్, సురేష్, వెంకటేష్, అశోక్, కుషలప్ప, శైలు, నరేష్, గొరక్, సాయిరాం, మధు, రుక్మాజి, జి.హెచ్.ఎం.సి శానిటేషన్ సూపర్వైజర్ రాందాస్ పాల్గొన్నారు.