Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
శంకర్పల్లి ప్రజలకు ఎల్లప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్ అందుబాటులో ఉంటుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి అన్నారు. మున్సి పల్ పరిధిలో హైదరాబాద్ రోడ్డు పక్కన ఉన్న అలారా మెడికల్ డయాగ్నోస్టిక్‌ను బుధవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు డయాగ్నోస్టిక్ సెంటర్ ఎల్లవేళల అందుబాటులో ఉంటుం దన్నారు. ఈ సెంటర్‌ను పట్టణ, మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. రోజురోజుకూ శంకర్పల్లి పట్టణం అభివృద్ధి చెందుతున్న తరు ణంలో పెద్ద ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్ రావడం అభినందనీయమన్నారు. ఈ కార్య క్రమం లో డాక్టర్. కిషోర్‌గౌడ్, డాక్టర్.రమేశ్‌గౌడ్, ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ వెంకట్ రామ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్ బుచ్చిరెడ్డి, సొసైటీ చైర్మెన్ శశిధర్ రెడ్డి, టీఆర్ఎస్ కౌన్సిలర్లు శ్రీనాథ్‌గౌడ్, చంద్రమౌళి, మాజీ ఎంపీపీ నర్సింలు, నాయకులు వెంకట్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డాక్టర్ సత్య నారాయణ, రామ్‌చందర్, బాల కృష్ణరెడ్డి, విజరు, రామ్‌చందర్ గౌడ్, మధుబాబు, పాండు, యాదగిరి గౌడ్, శ్రీరాములు గౌడ్, రఘుపతి రెడ్డి, రాజేష్‌గౌడ్, విష్ణు, రాఘవేందర్, శ్రీకర్, వెంకటేష్, నాగ మున్నయ్య, శ్రావణ్, అశోక్ గౌడ్, తాజుద్దీన్, డాక్టర్లు శశిరేఖ రెడ్డి, రామ్ చందర్, గంగాధర్, హరీష్, శ్రీజ, అనూష, రోహిత్, జగదీష్ రెడ్డి, లింగారెడ్డి, శశిధర్ రెడ్డి, సంపత్ కుమార్, రాములు, తదితరులు పాల్గొన్నారు.