Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ కమిషనర్ బీ. యాదగిరి
నవతెలంగాణ-శంకర్పల్లి
ప్లాస్టిక్‌ను ఎవరైనా అమ్మినా, కొన్నా వారికి జరిమానా తప్పదని శంకర్పల్లి మున్సిపల్ కమిషనర్ బీ. యాదగిరి హెచ్చరించారు. బుధవారం పురపాలక సంఘం శంకర్పల్లి పరిధిలో ఉన్న షాపుల్లో ప్లాస్టిక్ నిషేధంపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధించిన ప్లాస్టిక్‌ను అమ్మకాలు జరిపిన వారిపై రూ.500 నుంచి రూ 5 వేల జరిమానా విధించ నున్నట్టు తెలిపారు. ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్లు అమ్మకుండా పూర్తిగా నిషేధించాలని ఆదేశించారు. ఎవరైనా ప్లాస్టిక్ అమ్మకాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలో ఎం.ఎం ఫ్యాషన్ దుకాణాదారుడికి రూ.3 వేలు జరిమానా విధించినట్టు తెలిపారు. ఈ కార్యక్ర మంలో సానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్, బిల్ కలెక్టర్లు, పురపాలక సంఘం సిబ్బంది తదితరులున్నారు.