Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పది రోజుల్లో రెండు హత్యలు
- పాత కక్షలతో ప్రతీకార హత్య
- ఆస్తి తగాదాలతో తండ్రిని చంపిన కొడుకు
- భయాందోళనలో ప్రజలు
నవతెలంగాణ-తాండూరు
తాండూరు డివిజన్ పరిధిలో దారుణ హత్యల పరంపర కొనసాగుతోంది. వారం రోజుల్లో రెండు హత్యలు జరిగాయి.బషీరాబాద్ మండలంలో మొన్న జరిగిన హత్య మరువకముందే మరో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. జులైలో యాలాల మండల పరిధిలోని గౌతమి వెను కాల తల లేకుండా కేవలం మొండెం లభ్యం కావడం తో స్థానికులు భయాందోలనకు గురి అయ్యారు. పాత కక్ష్యలతో ఇసుక పంచాయతీతో ఒకరు, ఆస్తి తగాదాల్లో మరొక్కరూ హత్యకు గురైయ్యారు.
యాలాల మండలం సంగెంకుర్దు గ్రామంలో ఆస్తి కోసం కొడుకు తండ్రిని పోలం దగ్గర హత్య చేశారు. డబ్బు కోసం తోటి మనుషులను ప్రాణాలు తీసేందుకు ఓ మాత్రం వెనుకాడటం లేదు. కట్టుకొన్న భార్య అని కూడా చూడకుండా అక్రమ సంబంధం ఉన్నదన్న అనుమానంలో భర్యను కూడా పొట్టన పెట్టుకుంటు న్నారు. తాండూరు మండల పరిధిలోని రాంపూర్ తాండకు చెందిన గంజీ భాయిని(40) ఆమె భర్త రాత్రి వెళ్ళలో రోకలి బండతో కోట్టి చంపాడు. అదే మండల పరిధిలోని బెల్కటూర్ గ్రామంలో ఖాజా మైనోధ్దీన్(45)ను అతని తండ్రి సొంత తమ్ముళ్ళు కలిసి ఆస్తి కోసం హత్య చేశారు. పెద్దేముల్ మండలంలో అక్రమ సంబంధం అనుమానంతో ఎర్ర ప్రవీణ(25)కు అతని భర్త బాలప్ప భార్యకు మద్యం తాగించి గోంతునలిమి చంపారు. వివాహేతర సంబంధంతో భర్తకు ఆమె కొద్ది రోజులుగా దూరంగా ఉంటుంది. దీంతో భర్త భార్యను హత్య చేశాడు. గతంలో తన తల్లిదండ్రులను చంపాడని యువకుడు సొంత బాబాయిని బండరాయితో, కర్రలతో మోది చంపారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని సీతారాంపేట్ చెందిన ఎండి షరీఫ్ (30) ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. ఎంపి షరీఫ్‌కు అతని అన్న సత్తార్‌కు మధ్య ఆస్తి తగాదాలు ఉండేవి. ఇదే విషయంలో ఎంపి షరీప్, గౌస్‌తోపాటు మరొక్కరితో కలిసి అన్న సత్తార్, వదిన షహీం ఉన్నిసాను గతంలో బండరాయితో మో ది చంపాడు. ఈ కేసులో ఎండి షరీఫ్ ఎ2గా నమోదు అయ్యాడు. అప్పట్లో హత్యకు గురైనా ఎండి సత్తార్ కుమారుడు అబ్దుల్లా ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని తల్లిదండ్రులను చంపిన ఎండి షరీఫ్‌పై బండరాయితో దాడి చేసి చంపాడు. వరుసగా హత్యలు జరగడంతో తాండూర్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి హత్యకు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నిందితులను పట్టుకుంటాం
బషీరాబాద్ మండలంలో జరిగిన హత్య కేసులో నిందితు లను త్వరలో పట్టుకుంటాం. కర్నాటకలో హత్య చేసి సరిహద్దు ప్రాంతంలో పడేసినట్టు గుర్తించాం. గుర్తు తెలియని మృతదేహం కర్నాటక ప్రాంతానికి చెందిన వారిగా అనుమానిస్తున్నాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
- లక్ష్మీనారాయణ, తాండూర్ డీఎస్పీ