Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
విదేశీ యెమన్ దేశస్తురాలు తహని మహమ్మద్ అబ్దుల్హా(45)కు పదేండ్ల పాటు వినికిడి లోపం ఉంది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఇటీవల మెడికవర్ ఆస్పత్రిని సంప్రదించారు. రెండు చెవులకు వినికిడి పరికరాలను ఉపయోగించినా కొంత కాలంగా వినికిడి శక్తి పూర్తిగా క్షీణించింది. లిప్ రీడింగ్ ద్వారానే కమ్యూనికేట్ చేసేది. హైదరాబాద్లోని మెడికవర్ హాస్పిటల్స్లో ఈఎన్టీ నెక్ సర్జన్ డాక్టర్ సంపూర్ణ గోష్ని సంప్రదించింది. డాక్టర్ ఆమెకు కోక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ చేయాలని సలహా ఇచ్చారు. వెంటనే కుడి చెవికి ఇంప్లాంట్ చేశారు. చికిత్స తర్వాత నెలకు వినికిడి సాధారణ స్థితికి వచ్చింది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉంది. దేశంలో పిల్లలకు పుట్టుకతో వచ్చే వినికిడి లోపంలో కోక్లియర్ ఇంప్లాంట్ ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్ తెలుపుతున్నారు.