Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణికొండ
విద్యుద్ఘాతంతో ఒకరికి గాయాలైన ఘటన మణికొం డ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. బుధవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో గల లాలమ్మ గార్డెన్స్ లో 11కేవి కరెంట్ వైర్లకు తగిలి టీఆర్ఎస్ నాయకుడు బుద్ధోల్ బాబు కుమారుడు మణికంఠకు కరెంటు షాక్ తగిలి గాయాలయ్యాయి. ఈ ప్రమాదంతో కుడిచేతికి గాయం కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ విద్యుత్ శాఖ వారు మెయిన్ రోడ్డున వేయవలసిన 11కెవి వైర్లు ప్రజలు నివాసం ఉన్న కాలనిలో వేయడంతో అక్కడి జనం భయంతో ఉన్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.