Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో మియాపూర్ ఆల్విన్ కాలనీలో నిరసన
నవతెలంగాణ-మియాపూర్
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగికదా డులను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో బుధవారం ఆల్విన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు విమల మాట్లాడుతూ ఎన్ని చట్టాలు తెచ్చినా రోజురోజుకూ దేశవ్యాప్తంగా మహిళలపై, పసి పిల్లలపై లైంగికదాడులు, హత్యలు, గుడిలో, బడిలో రోడ్లపై ఆఖరికి ప్రభుత్వ కార్యాల యాలు, ప్రభుత్వ హాస్పిటల్లో ఇలా ప్రతిచోట మహి ళలపై అడ్డగోలుగా హత్యలు జరుగుతున్నాయని అన్నారు. అధికార, ప్రతిపక్ష నాయకులు స్పందించా ల్సిన స్థాయిలో స్పందించకపోవడం బాధాకరం అన్నా రు. మనదేశంలో కులానికి ఒక నీతి అనే విధంగా నాయకుల వ్యవహారం ఉందన్నారు. దిశ హత్య కేసు లో పార్లమెంటులో సైతం మాట్లాడిన రేవంత్రెడ్డి, అధికార పార్టీ దాని తర్వాత జరిగిన వందల సంఖ్యలో ఘటనల మీద ఎలాంటి ఖచ్ఛితమైన ప్రతిఘటన చర్యలు చేపట్టినట్టు కనిపించడం లేదన్నారు. ఉన్నత వర్గాల వారికి అన్యాయం జరిగితే ఒక లెక్క పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఒక లెక్క అన్నట్టుగా నాయకుల పనితీరు కనిపిస్తున్నదని మండిపడ్డారు. స్వతంత్ర దినోత్సవం రోజు గుంటూరులో రమ్యపై జరిగిన హత్య యావత్ దేశానికి సిగ్గుచేటు అన్నారు. గాంధీ హాస్పిటల్ నాలుగు రోజులు గడుస్తున్నా ఇంకా కేసును ఛేదించే పనిలో పోలీసులు ఉన్నాయని అన్నారు. రమ్యని హత్య చేసిన హంతకులను వెనువెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘం నాయకురాళ్ళు ఇంద్ర, ఈశ్వరమ్మ, విమల, లక్ష్మ, లావణ్య, సుల్తానా బేగం, అమీనా బేగం, శివాని, తదితరులు పాల్గొన్నారు.