Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మాడ్గుల
ఇబ్రహీంపట్నం సమీపంలోని రావిరాలలో నిర్వహిం చిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోర సభకు మాడు గుల మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీపీ గౌరవరం పద్మారెడ్డి ఆధ్వర్యంలో 35 క్రూజర్లలో ఆయా గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలి వెళ్లినట్టు వారు తెలిపారు. ఎంపీపీ మండ ల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్, పూలే, ఇందిరాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం కాంగ్రెస్ జెండాను ఊపి బాణా టపాసుల మధ్య క్రూజర్ లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణపల్లి సర్పంచ్ పులికంటి లక్ష్మయ్య, రవీందర్‌రెడ్డి, సీనియర్ నాయకులు పల్లెటి జంగయ్య గాలయ్య, బాల్‌రాజ్‌గౌడ్, యాదయ్య నారాయణగౌడ్, సురేష్‌నాయక్, యూత్, యువజన కాంగ్రెస్ నాయకులు కొప్పుల శేఖర్ గౌడ్, భూపేష్చారి, నందీశ్వర్ గౌడ్, దళపతిగౌడ్, శేఖర్ పాల్గొన్నారు.