Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్
నవతెలంగాణ-ఫరూఖ్‌నగర్
విద్యాసంస్థలను వెంటనే పున:ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ అన్నారు. పాఠశాలలను వెంటనే తెరవాలని షాద్‌నగర్ పట్టణంలో పుస్తకాలు చదువుతూ బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రశాంత్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ విద్యా సంవత్సరం వెంటనే ప్రారంభించాలని, అదేవిధంగా విద్యార్థులందరికీ వ్యాక్సిన్ అందించాలని డిమాండ్ చేశారు. సినిమా హాళ్లలో లేని కరోనా విద్యాసంస్థల్లో ఉంటుందా అని ప్రశ్నించారు. విద్యాసంస్థలను మూసివేసి విద్యార్థుల భవిష్యత్‌ను గాలికి వదిలేయడం సరికాదన్నారు. చదువులేక విద్యార్థులు బాలకార్మికులుగా, మందుబాబులుగా మారే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికైనా వెంటనే స్కూళ్లను ప్రారంభించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమలు చేపడుతామని హెచ్చరించారు.