Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలు తీసుకోవాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ఆమనగల్ ప్రభుత్వ ఆస్పత్రిలో కొనసాగుతున్న కోవ్యాక్జిన్ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. వైద్యులతో మాట్లాడి రోగులకు అందంతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు. అనంతరం ఆమనగల్లో నిర్వహించిన గౌరిపల్లి వాస్తవ్యుల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతకు ముందు ఆయన స్థానిక నాయకులతో కలిసి కడ్తాల్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హౌటల్‌ను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీకాంత్, తిరుపతి రెడ్డి, నాయకులు హన్మానాయక్, భాస్కర్ రెడ్డి, జహంగీర్ అలీ, సురేందర్ రెడ్డి, కేఎన్ఆర్ యువసేన అధ్యక్షుడు మెకానిక్ బాబా, తదితరులు పాల్గొన్నారు.