Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొందుర్గు
మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని షీ టీం పోలీసులు తెలిపారు. శుక్రవారం షీ టీం ఆధ్వర్యంలో కొందుర్గు మండల కేంద్రంలో స్థానిక మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అపరిచిత పట్ల, అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరూ తమ బ్యాంక్‌కు సంబంధించిన వివరాలు, ఓటీపీలు తెలియని వ్యక్తులకు చెప్పొదన్నారు. మహిళలు, బాలికలకు పోకిరీల నుంచి బెదిరింపులు, ఇబ్బందికర ఫోన్ కాల్స్ వస్తే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. తద్వారా రక్షణ చర్యలు చేపడుతామని అన్నారు. అదేవిధంగా మండల ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.