Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పిప్పళ్ల శివశంకర్
నవతెలంగాణ-ఆమనగల్
అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పిప్పళ్ళ శివశంకర్ అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ సంయుక్తల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు తలకొండపల్లి పోలీసులు ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులను శుక్రవారం తెల్లవారుజామున ముందస్తుగా అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈసందర్భంగా డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు పిప్పళ్ల శివశంకర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భతిని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాగే మొండిగా వ్యవహరిస్తే ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపచేస్తామని శివశంకర్ హెచ్చరించారు.