Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ కడ్తాల్ మండల కన్వీనర్ కే పుష్ప
నవతెలంగాణ-ఆమనగల్
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సీఐటీయూ మండల కన్వీనర్ కేతావత్ పుష్ప డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఛలో హుజురాబాద్ శంఖారావాన్ని అడ్డుకోవడంలో భాగంగా కడ్తాల్ మండల సీఐటీయూ కన్వీనర్ కేతావత్ పుష్ప, నాయకులు చెన్నయ్య, కుమార్, మల్లేష్, నరసింహను పోలీసులు ముందస్తుగా శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు పోలీసు స్టేషన్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఎన్నికల సమయంలో పారిశుధ్య కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం అందించాలని, మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కన్వీనర్ పుష్ప డిమాండ్ చేశారు.