Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ నేతలు శ్రీకాంత్‌రెడ్డి, బాదేపల్లి సిద్దార్థ
నవతెలంగాణ-షాద్‌నగర్ రూరల్
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఇష్టానుసారంగా విమర్శలు చేయడం తగదని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కో-ఆర్డినేటర్ బాదేపల్లి సిద్దార్థ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్న కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డిపై ఎమ్మెల్యే ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. ఏడుపదుల వయస్సులోనూ రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తున్న వ్యక్తిని కించపరిచేలా మాట్లాడం సరికాదన్నారు. ఇప్పటికైనా కోదండరెడ్డిపై అనవసర విమర్శలు, అసత్య ఆరోపణలు మానుకోవాలి సూచించారు.