Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
అసంపూర్తిగా ఉన్న రోడ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఏఐఎఫ్బీ జిల్లా అధ్యక్షుడు మోహనాచారి అన్నారు.పరిగి పట్టణంలో గంజి రోడ్లో, కోర్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రోడ్లును అధికారులు తవ్వి వదిలేశారని తెలిపారు. శుక్రవారం ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలనీ, కాంట్రాక్ట్ కుదిరించుకుని, రోడ్లను ఇరువైపులా జేసీబీలతో తవ్వకాలు చేసి మధ్యలోనే పనులను నిలిపి వేయడం సరైంది కాదన్నారు. రోడ్లు తవ్వి వదిలేస్తే , వాహనదారులకు, పాదాచారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై అధికారులకు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. రోడ్ల నిర్మాణ పనులు అధికారులు పట్టించుకో కపోవడంతోనే నత్తనడకన సాగుతున్నాయని ఆరోపించారు. అంతేకాకుండా దుమ్ముతో వాహనదారులకు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, అసంపూర్తి రోడ్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించాలని కోరారు.