Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాల నోటిఫికేషన్లు వెంటనే జారీ చేయాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
నవతెలంగాణ-తాండూరు
అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో 50 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా పోలీసులు ముంద స్తుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో మిగింలింది ఏమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన 50వేల ఉద్యోగాల భర్తీనీ వెంటన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందని కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు.రాత్రికి రాత్రి ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పతనానికి నాంది అన్ని హెచ్చరించారు.