Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కిసాన్ కాంగ్రెస్ జిల్లా చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
కాంగ్రెస్ నాయకుల పట్ల ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని జిల్లా కిసాన్ కాంగ్రెస్ చైర్మెన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా కోఆర్డినేటర్ బదేపల్లి సిద్ధార్థ హెచ్చరించారు. 77 ఏండ్ల వయస్సులో కూడా రైతాంగ సమస్యల మీద ఎనలేని పోరాటం చేస్తున్న కిసా న్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదన్నారు. గౌరవమైన పదవిలో ఉండి రైతుల గురించి ఎనలేని పో రాటం చేస్తున్న కోదండరెడ్డిని నోటికొచ్చినట్టు మాట్లాడ టం చాలా విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం వారు స్థానికంగా మాట్లాడారు. కోదండరెడ్డి ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసుకొని యాచారంలో బతుకుతున్నారని అనేక సార్లు చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని ప్ర శ్నించారు. రాళ్లు, రప్పలు వ్యవసాయానికి పనికి రాని భూ ములు మాత్రమే ఫార్మా సిటీకి తీసుకుంటున్నామని చెప్ప డం చూస్తుంటే ఎంత అబద్ధాల కోరో అర్థమవుతుందని చెప్పారు. పచ్చని పంటలు పండే భూములను బలవం తంగా లాక్కుంటే రైతుల పక్షాన నిలబడాల్సింది పోయి రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కోదండరెడ్డి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదన్నారు. కాంగ్రెస్ గిరిజన, దళితులకు ఇచ్చిన వ్యవసాయ భూములను ఫార్మా సిటీ పేరుతో రూ.6లక్షల నుంచి రూ.7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే, కోదండరెడ్డి పోరాటం చేస్తే రూ.16 లక్షలుగా పెంచిన విషయాన్ని గుర్తుంచుకోవాల న్నారు. ప్రభుత్వం ఎకరా కోటీ రూపాయలకు అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. ఈ ప్రాంతాన్ని కలుషితం చేస్తుందని విమర్శించారు. రైతుల భూములను లాక్కుని వ్యాపారం చేసే ప్రభుత్వమే రైతు ద్రోహులుగా మిగులుతారన్నారు.