Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సంతోష్, టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్
నవతెలంగాణ- యాలాల
తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో దళితులకు సంక్షేమ పథకాలు వర్తింపు ఎక్కడ జరుగుతుందని టీపీసీసీ జనరల్ సెక్రెటరీ సంతోష్, టీపీసీసీ ఉపా ధ్యక్షులు ఎం. రమేష్ మహారాజ్ అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం యాలాల మండలం లోని సంగాయిపల్లి తండ పంచాయితీలో వారు గిరిజన తలుపులు తట్టారు. పంచాయతీలో పర్యటించి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో ప్రతి గిరిజన తండాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటామన్నా రు. దళిత బంధు పథకం పేరుతో దళితులను మరోసారి సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యాలాల మండల అధ్యక్షులు ఎ. బీమయ్య, సీనియర్ నాయకులు ఉత్తమ్ చంద్, నర్సిరెడ్డి. తండావాసులు, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.