Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండలం సాల్వీడ్ గ్రామంలో ఇటీవలే వర్షం పడి చాకలి బాలయ్య ఇల్లు కూలి పోవడంతో శుక్రవారం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.5వేల ఆర్థిక సహాయం అందజేశారు.
పార్టీ నాయకులకు అండగా ఉంటాం : మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ నాయకులకు అండగా ఉంటామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రామ్మో హన్‌రెడ్డి అన్నారు. కుల్కచర్ల మండలం సాల్వీడ్ గ్రామం లో కాంగ్రెస్ నాయకులు విఠల్ నాయక్ మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. ఆ సమయంలో అందుబాటులో లేకపోవ డంతో శుక్రవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ముదిరాజ్, కాంగ్రెస్ బ్లాక్ 2 అధ్యక్షుడు కర్రే భరత్ కుమార్, మాజీ ఎంపీపీ అంజిలయ్య గౌడ్, విఠల్‌నాయక్, స్థానిక సర్పంచ్ బాలయ్య, ఘనపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్, వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు.