Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్
నవతెలంగాణ-మర్పల్లి
జాతీయ ఉపాధి హామీ కింద మండలంలో చేపట్టిన పనుల వివరాలన్నీ రిజిస్టర్లో నమోదు చేసి ఉండాలని ఎంపీడీవో వెంకట్రామ్‌గౌడ్ అన్నారు. కేంద్ర బృందాల పర్యటన నిమిత్తం శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో డీఆర్డీఏ, ఏపీఓ లక్ష్మి కుమారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పెండింగ్‌లో ఉన్న వివరాలన్నీ 2 రోజుల్లోగా నమోదు చేయడం పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. 7 రిజిస్టర్లు పూర్తి వివరాలతో ఉండాల న్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద చేపట్టిన పనులను కేంద్ర బృందం ఆకస్మిక తనిఖీ చేయనున్నా రని పనులు చేపట్టిన చోట పూర్తి వివరాలతో నేమ్ బోర్డు ఉండాలన్నారు. గ్రామం ఎంట్రెన్స్‌లో విలేజ్ నేమ్ బోర్డు చేపట్టిన పనుల వివరాలు తప్పనిసరి అన్నారు. జిల్లా అధికారులు సూచించిన విధంగా అన్ని వివరాలను సరి చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో అంజిరెడ్డి, ఈవో విట్టల్‌రావు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.