Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
మియాపూర్ డివిజన్ నడిగడ్డతండాలో సీఆర్పీఎఫ్ క్యాంపస్ వద్ద నడిగడ్డతండా, సుభాష్ చంద్రబోస్లో నివసిస్తున్న ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న సీఆర్పీఎఫ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులను వారి హక్కుల గురించి ప్రశ్నిస్తూ సోమవారం ధర్నా చేపట్టినట్టు బీజేపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ సమస్యను ఇదివరకే బీజేపీ తరఫున ఢిల్లీ వరకు తీసుకెళ్లి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అర్జీ ఇచ్చినట్టు తెలిపారు. బీసీ కమిషన్ మెంబర్ ఆచారిని తండాకు ఆహ్వానించి, వారికి సమస్యను పూర్తిగా వివరించిన సంగతీ గుర్తు చేశారు. అదేవిధంగా బీజేపీ తండావాసులకు పూర్తి అండగా నిలుస్తున్నదని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, ఎడ్ల ఆంజనేయులు, చందు, రత్నాకర్, జాజిరావు శ్రీను, జి మల్లేష్, జాజిరావు రాము, రవీందర్, రాజేందర్, దుర్గేష్, నాయకులు పాల్గొన్నారు.