Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అయిలి వెంకన్న గౌడ్
నవతెలంగాణ-ఆమనగల్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గౌడ బంధును ప్రకటించాలని తెలంగాణ గౌడ వత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు అయిలి వెంకన్న గౌడ్ డిమాండ్ చేశారు. గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు యెలికట్ట విజరు కుమార్ గౌడ్‌తో కలిసి సోమవారం అమనగల్ పట్టణంలో కాటమయ్య దేవాలయం ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 40 లక్షల మంది గౌడ జనాభా ఉండగా అందులో 3 లక్షల మందికిపైగా కల్లుగీత వత్తిపైన ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. దళితబంధు ప్రకటించి గౌడ బంధు, బీసీ బంధును ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలను విస్మరించడాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రతి కల్లుగీత వత్తిదారులకు లైసెన్సులు, గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రతి జిల్లా కేంద్రంలో నీరా ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎలికట్ట విజరు కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ప్రతిష్ఠించాల న్నారు. ఈ సమావేశంలో బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సుగూరి దుర్గయ్య గౌడ్, సింగం బాలస్వామి గౌడ్, ఉపాధ్యక్షులు లింగంగౌడ్, జేఏసీ చైర్మన్ ఆయిళ్ల సదానందం గౌడ్, యాచారం వేంకటేశ్వర్లు గౌడ్, కేశమోని శ్రీనివాస్ గౌడ్, కొప్పుల శేఖర్ గౌడ్, సింగ నాగేష్‌గౌడ్, అల్లాజి గౌడ్, రవిగౌడ్, కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.