Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే..
- కాంగ్రెస్ షాద్నగర్ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్
నవతెలంగాణ -జిల్లేడు చౌదరిగూడెం
ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి రాజకీయ లబ్ది పొందడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని షాద్నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి వీర్లపల్లి శంకర్ విమర్శించారు. సోమవారం మండల పరిధిలోని చలివేంద్రంపల్లి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతున్నదని ఎద్దేవా చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన తెలంగాణ కేవలం సీఎం కుటుంబానికి మాత్రమే లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. అంతేకాక సీఎం సొంత నిర్ణయాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల లబ్ది కోసం దళితులపై సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. దళిత సీఎం, మూడెకరాల భూమి లాంటి హామీలను మరిచిపోయి దళిత బంధు పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు. దళితబంధు పథకాన్ని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అభివద్ధి కోసం కాంగ్రెస్ మాత్రమే కషి చేస్తున్నదన్నారు. సీలింగ్ యాక్ట్ పేరుతో నిరుపేద వర్గాలకు వ్యవసాయ భూములు అందజేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వంలో వాటిని లాక్కొని అమ్ముకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామీణ ప్రాంతాల అభివద్ధి జరిగిందన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. రేవంత్ టీపీసీసీ అధ్యక్షుడు అయిన తరువాత టీఆర్ఎస్ నాయకుల్లో గుబులు పెరిగిందన్నారు.
నేటి నుండి గ్రామాల్లో దళిత,గిరిజన దండోరా సభలు..
తెలంగాణ లో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజక వర్గ అన్ని గ్రామాల్లో దళిత,గిరిజన దండోరా సభలు నిర్వహించి వారికి రావాల్సిన హక్కులను సాధించే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. కొత్తూర్ మండలం ఎస్ బి పల్లి గ్రామంలో ఈ సభను ప్రారంభించనునట్లు ఆయన తెలిపారు.
మాటలు తప్ప చేతలు లేవు : చలివేంద్రంపల్లి రాజు
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మాటలు తప్ప చేతలు చూపించడం లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చలివేంద్రంపల్లి రాజు విమర్శించారు. ఓట్ల కోసం పథకాలను ఎరగా వేసి ఓట్లు దండుకోవడం తప్ప వాటి అమలు మాత్రం మరిచిపోతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబర్ ఖాన్, బాలరాజ్ గౌడ్, కష్ణారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఎజాజ్ అలీ, ఖలీల్, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి, ఆంజనేయులు, నర్సింహులు, అశోక్, తిరుమలేష్, అన్వర్, వేణు పాల్గొన్నారు.